Description of PRANAYAMA VIDI

 1)బాహ్య విషయకము:

వాయువును బయటకి తీసి బయట నిలుపుట , అనగా ఊపిరి తిత్తులలోని గాలిని వేగముతో  బయటకి వదిలి, ఇక బయట నిలుపుట కష్టం అనిపించినప్పుడు , నెమ్మది నెమ్మదిగా గాలిని లోపలికి తీసుకొని మరల అట్లే చేయవలయును 

2)అభ్యంతరము:

వాయువును లోపలికి తీసుకొని , ఎంత సేపు లోపల వుంచగలరో అంత సేపు ఉంచి, తిరిగి బయటకు వదలుట, ఇక్కడ ముఖ్యమైంది లోపల ప్రాణమును (వాయువును) నిలుపటము 

3)స్తంభవృత్తి:

 లోపల అలాగే బయట ఎక్కడ వాయువును అక్కడ నిలపాలి , అంటే కంఠం,నాసికాగ్రం మరియు ఇతర ప్రదేశములన నిలుపవలయును 

4) బాహ్యాభ్యంతరాక్షేపీ:

లోపలి నుండి గాలి వెలుపలకు వస్తున్నప్పుడు , దానికి విరుద్ధముగా అంటే బయటికి రానివ్వకుండా లోపలకి గాలిని తీసుకోవడానికి ప్రయత్నించాలి , అలాగే బయటనుండి గాలి లోపలికి రానున్నపుడు దానిని రాకుండా లోపలి గాలిని బయటికి పంపించడానికి ప్రయత్నించాలి 


పైన చెప్పబడిన విధముగా మీ సామర్ధ్యం అనుగుణము గా కొన్ని నిమిషాలు చెయ్యవచ్చు , ఆ సమయమున మనస్సు అందు ఓమ్ ను జపించాలి , ఇలా చేయడం వలన ఆత్మ, మనస్సు పవిత్రముగా, స్థిరంగా వుండును 

- source(సత్యార్ధ ప్రకాశము -మహర్షి దయానంద సరస్వతి విరచిత, పండిత గోపదేవ్ శాస్త్రి - తెలుగు అనువాదము ) -తృతీయ సముల్లాసము .ప్రాణాయామము చతుర్విదములు







Comments

Popular posts from this blog

ENLITE YOUR SELF